IND vs SL | రాహుల్, పడిక్కల్ హాఫ్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్..!
IND vs SL : ఆరొందల టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(32) నిరాశపరిచినా.. కేఎల్ రాహుల్(58 నాటౌట్), దేవ్‌దత్ పడిక్కల్(78 నాటౌట్)లు ధీటుగా ఆడుతున్నారు.
IND vs SL : ఆరొందల టెస్టులో భారత జట్టు(Team India) భారీ స్కోర్ దిశగా సాగుతోంది. గాలే స్టేడియంలో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(32) నిరాశపరిచినా.. కేఎల్ రాహుల్(58 నాటౌట్), దేవ్‌దత్ పడిక్కల్(78 నాటౌట్)లు ధీటుగా ఆడుతున్నారు. లంచ్ అనంతరం జోరు పెంచిన ఈ ద్వయం శతక భాగస్వామ్యం నెలకొల్పింది. మూడో స్థానంలో నేను సరిపోతాను అని నిరూపించుకుంటూ పడిక్కల్ అర్ధ శతకం సాధించగా.. టీమిండియా స్కోర్ దాటింది. లంక బౌలర్ల వ్యూహాల్ని చిత్తు చేస్తున్న ఇద్దరూ సెంచరీలకు చేరువయ్యారు.
వామప్ మ్యాచ్‌లో విజయంతో ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్న భారత్ తొలి టెస్టులో పటిష్ట స్థితిలో ఉంది. గాలే మైదానంలో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్(32) అనూహ్యంగా రనౌటయ్యాడు. వికెట్ పడినా.. కేఎల్ రాహుల్(58 నాటౌట్) జతగా దేవ్‌దత్ పడిక్కల్(78 నాటౌట్) నిలబడ్డాడు. శ్రీలంక బౌలర్లను కాచుకున్న ఈ ద్వయం నెమ్మదిగా స్కోర్‌బోర్డును నడిపించింది. ఫలితంగా 101/1తో లంచ్‌కు వెళ్లింది టీమిండియా.
Rock-solid knock! 👌
21st Test FIFTY for #TeamIndia vice-captain KL Rahul 👍
He and Devdutt Padikkal also complete a 1⃣0⃣0⃣-run stand! 🤝
Updates ▶️ https://t.co/WHXkfnivbw#SLvIND pic.twitter.com/25x9S68qyG
— BCCI (@BCCI) August 15, 2026
భోజన విరామం అనంతరం కూడా రాహుల్, పడిక్కల్ పట్టుదలగా ఆడారు. లహిరు కుమార ఓవర్లో సింగిల్‌తో పడిక్కల్ ఈ ఫార్మాట్లో రెండో అర్ధ శతకం నమోదు చేశాడు. ఆపై సోనాల్ దినుషా ఓవర్లో పడిక్కల్ బౌండరీతో వీరి భాగస్వామ్యం వందకు చేరింది. ఆ తర్వాతి ఓవర్లోనే సింగిల్‌తో టెస్టుల్లో 21వ ఫిఫ్టీ సాధించాడు రాహుల్. 47 ఓవర్లలో వికెట్ నష్టానికి 171 పరుగులు చేసింది భారత్. ఇంకా 38.4 ఓవర్లు మిగిలి ఉండడంతో.. తొలి రోజే స్కోర్ మూడొందలు దాటేలా ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

