Transformer | జహీరాబాద్, మే 16 : జహీరాబాద్ పట్టణ పరిధిలోని రంజోల్ గ్రామంలో ప్రమాదాలకు నిలయంగా మారిన ట్రాన్స్పార్మర్ను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. స్థానిక గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన ఎర్తింగ్ వైరుకు తగిలి పలువురితోపాటు మూగజీవులు ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
గురువారం సాయంత్రం ట్రాన్స్ఫార్మర్ సమీపం గుండా వెళ్తున్న రెండు పశువులు ఎర్తింగ్ వైరుకు తగలడంతో అక్కడిక్కడే మృతిచెందాయన్నారు. ట్రాన్స్ఫార్మర్ను తొలగించి వేరే చోట ఏర్పాటు చేయాలని పలుమార్లు సంబంధిత విద్యుత్శాఖాధికారులను కోరినా పట్టించుకోవడం లేదన్నారు.
ట్రాన్స్ఫార్మర్ సమీపం గుండా రాకపోకలు సాగించే సమయంలో ప్రజలు, మూగజీవులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు తగు చర్యలు తీసుకొని ట్రాన్స్ఫార్మర్ను తొలగించి వేరే చోట ఏర్పాటు చేసేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Read Also :
Water tank | పాఠశాలలో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్.. భయందోళనలలో విద్యార్థులు
Badibata program | నిజాంపేట మండల వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం
Huge Donation | తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త గోయాంక భారీ విరాళం