Nominations | మునిపల్లి, డిసెంబర్ 01 : అసౌకర్యాల మధ్య నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థులు సరైన ఏర్పాట్లు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు.
మునిపల్లి మండల కేంద్రమైన మునిపల్లితోపాటు, మండలం పరిధిలోని బుదేరా, కంకోల్, పెద్దచేల్మడ, పెద్దల్లోడి గ్రామాల్లో గల రైతు వేదికల వద్ద నామినేషన్లు వేసేందుకు సౌకర్యాలు సరిగ్గా ఏర్పాటు చేయకపోవడంతో లబ్ధిదారులు ఎక్కడ నీడ ఉంటే అక్కడ కూర్చుంటూ అవస్థలు పడుతున్నారు.
మునిపల్లి మండలంలో సంబంధిత అధికారులు పట్టింపు లేనట్టు వ్యవహరించడంతో నామినేషన్లు వేసేందుకు వచ్చిన ఆయా గ్రామాల లబ్దిదారులు అనేక అవస్థలు పడుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొని నామినేషన్ కేంద్రాల వద్ద మెరుగైన ఏర్పాట్లు చేయాలని అభ్యర్థులు ఉన్నత అధికారులను కోరుతున్నారు.

Padipuja | అయ్యప్ప స్వామి పడిపూజలో మాజీ ఎమ్మెల్యే
Local Election | విద్యుత్ నో డ్యూ సర్టిఫికెట్ కోసం ఎన్నికల అభ్యర్థుల తిప్పలు
Bomb Threat | కేరళ సీఎంకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు