హైదరాబాద్, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ): తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదటి దశలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 60 తహసీల్దార్ కార్యాలయాలు, 5 ఆర్డీవో కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. రెండో విడతలో మరో 170 కార్యాలయాలను నిర్మిస్తామని చెప్పారు.