స్ప్రింగ్ స్ప్రీకి వేళాయె..
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో ఈనెల 27, 28 తేదీల్లో వార్షిక సాంసృతిక మహోత్సవం స్ప్రింగ్ స్ప్రీ-2026 నిర్వహించనున్నారు. సంగీతం, సినిమా, కళలు, సాహిత్యం, విద్యార్థుల సృజనాత్మకతకు కేంద్ర బిందువుగా క్యాంపస్‌ను మార్చనుంది.
- ఈ నెల 27, 28న నిట్‌లో పలు ఈవెంట్లు
- దర్శకుడు శైలేష్ కొలనుతో ఇంటరాక్షన్
హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 25 : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో ఈనెల 27, 28 తేదీల్లో వార్షిక సాంసృతిక మహోత్సవం స్ప్రింగ్ స్ప్రీ-2026 నిర్వహించనున్నారు. సంగీతం, సినిమా, కళలు, సాహిత్యం, విద్యార్థుల సృజనాత్మకతకు కేంద్ర బిందువుగా క్యాంపస్‌ను మార్చనుంది. భవ్యమైన ప్రో షోలు, ప్రముఖులతో పరస్పర సంభాషణలు, 40కి పైగా విభిన్న క్లబ్ ఈవెంట్లతో ఈ ఏడాది సంచిక ఉండనుంది.
ప్రధాన గేట్ నుంచి భవనం వరకు, క్యాంపస్‌లోని కీలక ప్రదేశాలన్నింటా చేసిన ఏకరూప స్వర్ణవర్ణ అలంకరణలు సంబురాన్ని, ఐక్యతను, సాంసృతిక వైభవాన్ని ప్రతిబింభిస్తున్నాయి. ప్రారంభానికి ముందే స్వతంత్రంగా నిర్వహించిన తొలి ‘కర్టెన్ రైజర్’ ఆకట్టుకుంది. అనంతరం నిర్వహించిన ‘ఎథ్నిక్ నైట్’ ఈ ఏడాది సాంసృతిక మహోత్సవానికి ఘనమైన ఆరంభాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుద్ధి మాట్లాడుతూ స్ప్రింగ్ స్ప్రీ విద్యార్థుల సృజనాత్మకత, సాంసృతిక ఉత్సాహానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.
స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ స్ప్రింగ్ స్ప్రీలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు సహా వేలాది మంది అంతర్గత భాగస్వాములు పాల్గొననున్నారని, స్టేడియం, ఆడిటోరియం, ఎస్ఏసీ, ఏఎల్సీ, అకడమిక్ భవనాల్లో ఒకేసారి అనేక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. స్ప్రింగ్ స్ప్రీ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కేఎస్ రాజమోహన్ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రో షోల్లో మొదటిరోజు స్టేడియంలో జోనితాగాంధీ, రెండోరోజు రణినారెడ్డి ప్రదర్శనలుంటాయన్నారు. ప్రారంభ కార్యక్రమంలో అడివి శేష్ ‘డెకాయిట్’ మూవీ టీమ్‌తో కలిసి సాంగ్ లాంచ్ ఉంటుందని, అలాగే ‘డైరెక్టర్స్ కట్’లో దర్శకుడు శైలేష్ కొలను, స్వయంభూ సినిమా బృందంతో ఇంటరాక్షన్ ఉంటుందన్నారు.
మిగిలింది నెల రోజులే..
పన్ను వసూళ్లలో బల్దియా ఆపసోపాలు పడుతున్నది. మరో నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, పన్నుల సేకరణ 50శాతం కూడా దాటకపోవడంతో ఆందోళన చెందుతున్నది. సొంత వనరులతో మనుగడ సాగించే బల్దియా పన్ను వసూళ్లలో ప్రణాళికాబద్దంగా అడుగులు వేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. చివరి రోజుల్లో కిందిస్థాయి సిబ్బందికి టార్గెట్లు పెట్టడంతో ఒత్తిడికి గురవుతున్నారు.
– వరంగల్, ఫిబ్రవరి 25
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

