హైదరాబాద్, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ): తెలంగాణకు ఆర్థిక మూలాలు పెంచేలా పశు, సంవర్ధకశాఖను అభివృద్ధి చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. 2026-2027 ఏడాదికి పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి బడ్జెట్ ప్రతిపాదనలపై బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడ్జెట్లో నిధులు ఎన్ని కేటాయించారనేది కాకుండా, ఎంతమేరకు ఖర్చు చేశామనే ఆలోచనతో పనిచేయాలని సూచించారు.