KTR | సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకుల చేతిలో హత్యకు గురైన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. వెంకటేశం మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్ ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీనిచ్చారు.
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ చిన్నారి పేరు ప్రసన్న. ఐదో తరగతి చదువుతోంది. క్షుద్ర రాజకీయాలు, చిల్లర రాజకీయాల వల్ల ఈ పాప తండ్రిని కోల్పోయింది. ఎందుకు ఆమె తండ్రి చనిపోయాడు.. ఏదైనా చేసి రాజకీయ లబ్ధి పొందాలే. అవసరమైతే మనుషుల ప్రాణాలు తీసైనా సరే.. చంపేసి అయినా సరే రాజకీయంగా బద్నాం చేయాలే.. అనే ఒకే ఒక చిల్లర ప్రయత్నంలోవెంగళ వెంకటేశం మన మధ్యలో లేకుండా పోయారు. వాళ్ల భార్య, పాప, తల్లిని అనాథలను చేసి ఆయన పోయారు. రాష్ట్ర రాజకీయాల్లో 20 ఏండ్లుగా నేను కూడా ఉన్నా. ఇంకా చాలా పెద్దలు ఇక్కడ సీనియర్లు కూడా ఉన్నారు. నేను ఎన్నడూ ఇంత దిగజారుడు రాజకీయం, ఇంత దరిద్రపుగొట్టు రాజకీయం మేం జీవితంలో కూడా చూడలేదన్నారు.
మా నాన్న రాలేదు..మూడు రోజులు నేను తినలేదు అని ఆ పాప ఏడస్తూ చెప్తుంటే మనస్సున్న మనిషి కళ్లల్లో నీళ్లు తిరగక మానవు. గుండె ద్రవించక మానదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోవాలి అనుకుంటే ఎన్నికల్లో తలపడొచ్చు… లేదా నాయకులతో విమర్శలు చేయొచ్చు. మీరు ఇప్పటికే చేస్తున్నట్టుగా కేసులుపెట్టొచ్చు.. వేధించొచ్చు. కానీ మధ్యలో సామాన్యులను సమిధలుగా చేసి, బలిపశువులను చేసి వాళ్ల జీవితాలను ఆగం చేస్తే ఏమొస్తదని కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతున్నా. చనిపోయింది వెంకటేశం.. అరెస్ట్ చేసింది చోటామోటా కాంగ్రెస్ నాయకులను. కానీ ఆ చోటమోటా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం పాత్రదారులు మాత్రమే. అసలు సూత్రదారులు పెద్దవాళ్లు వెనకాల ఉన్నరు.. తప్పించుకున్నారు. కానీ మేం వదిలిపెట్టం. వెంకటేశం భార్య మమ్మల్ని అడిగింది. అన్నా న్యాయం జరిగేదాకా మాతో ఉండండి అని అడిగింది.
ఎంతపెద్దవారున్నా వారిని బయటకు తీసుకురండి..
ఈ (వెంకటేశం పాత ఇల్లు) ఇల్లుతో ఇబ్బందికరంగా ఉంది. కొత్త ఇల్లు మంజూరు చేయాలని కాంగ్రెస్ నాయకుల దగ్గరకుపోతే దాని కోసం నెలరోజులుగా తిప్పించుకుని ఇవాళ ఈ పరిస్థితి తెచ్చారని కేటీఆర్ మండిపడ్డారు. అందుకే నేనిప్పుడే కలెక్టర్‌తో మాట్లాడి చెప్పిన.. మీరు ఇల్లు ఇస్తరా.. ఇవ్వండి లేదా మా పార్టీ తరపున మేం ఇల్లు కట్టిస్తమనిచెప్పినం. ఇప్పుడు ఆ పాపకు 11 ఏండ్లు. ఆమె పేరు మీద రూ.౩ లక్షలు పిక్స్డ్ డిపాజిట్ చేసినం. ఆమె 18 ఏండ్లు నిండి మేజర్ అయిన తర్వాత మెచ్యూర్ అయ్యేలా డిపాజిట్ కూడా చేశాం. ఆ పాప పదోతరగతి దాకా నేనే చదివిపిస్తానని చెప్పా. చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాలనేచిల్లర ప్రయత్నం స్థానిక సిరిసిల్ల కాంగ్రెస్ నాయకత్వం చేసిందో ఇదిఎన్నటికీ కూడా క్షమించరాని నేరం. సభ్య సమాజం కూడా అసహ్యించుకునే దుర్మార్గమైన పరిస్థితి.
నేను పోలీస్ అధికారులను కూడా కోరుతున్నా. దయచేసి ఈ కుటుంబానికి న్యాయంచేయాలని పోలీస్ అధికారులను కోరుతున్నా. దయచేసి ఇందులోరాజకీయాలు అవసరంలేదు. దీని వెనుక ఎంతపెద్దవారున్నా వారిని బయటకు తీసుకురండి. ఈ కుటుంబానికి న్యాయం చేయాలని నేను సిరిసిల్ల ఎమ్మెల్యేగా, వారి ఫ్యామిలీకి మాటిచ్చిన ఒక సోదరుడిగా, ప్రజాప్రతినిధిగా డిమాండ్ చేస్తున్నా. వదిలిపెట్టమని కేటీఆర్ హెచ్చరించారు.
LIVE: సిరిసిల్లలో కాంగ్రెస్ గూండాల చేతిలో హత్యకు గురైన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని పరామర్శిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS https://t.co/mAIZwDO8rT
— BRS Party (@BRSparty) August 12, 2026
Ketogenic Diet | కీటోజెనిక్ డైట్ అంటే ఏమిటి.. భారతీయులకు ఇది సెట్ అవుతుందా..?
Amit Shah | అన్నింటికీ సమాధానం ఇస్తానన్న అమిత్ షా.. భయం లేదన్న రాహుల్ గాంధీ
FCRA Bill: జేపీసీకి ఎఫ్సీఆర్ఏ బిల్లు.. లోక్‌సభలో తీర్మానం పాస్