MLA Manik Rao | జహీరాబాద్ , డిసెంబర్ 29 : జహీరాబాద్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో జీరో అవర్లో ఎమ్మెల్యే మాణిక్ రావు నియోజకవర్గ సమస్యలపై ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జహీరాబాద్ నియోజకవర్గంలో భారీ వర్షాలతో రోడ్లన్నీ చెడిపోయాయని ప్రజలు, ప్రయాణికులు వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. జహీరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించినా నేటి వరకు పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్నారు.
నియోజకవర్గంలోని ఝరాసంగం మండల కేంద్రంలో కేతకి సంగమేశ్వర ఆలయానికి కర్ణాటక, మహారాష్ట్రతోపాటు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు వస్తారని మండల కేంద్రంలోని ఆరు పడుకల ఆస్పత్రి సరిపోవడంలేదని, ఆస్పత్రిని 30 పడకల ఆసుపత్రిగా పెంచేలా చొరవ చూపాలని ప్రభుత్వాన్ని కోరారు.