Vijay | విజయ్‌ని చుట్టు ముట్టిన అభిమానులు.. ఒక్కసారిగా కింద పడిపోవడంతో..
Vijay | తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సినీ ప్రయాణానికి త్వరలోనే ముగింపు పడనుంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, తన చివరి సినిమా ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’) అని ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ శనివారం (డిసెంబర్ 27) మలేషియాలో ఘనంగా జరిగింది.
Vijay | తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సినీ ప్రయాణానికి త్వరలోనే ముగింపు పడనుంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, తన చివరి సినిమా ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’) అని ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ శనివారం (డిసెంబర్ 27) మలేషియాలో ఘనంగా జరిగింది. ఆడియో లాంచ్ కార్యక్రమం ముగించుకుని మలేషియా నుంచి చెన్నైకి తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో విజయ్ అభిమానులపై తన ప్రేమను మరోసారి చాటుకున్నారు. అభిమానులతో ముచ్చటిస్తూ, వారిని ఆప్యాయంగా పలకరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.
ఎయిర్పోర్ట్ గేట్ వద్దకు వచ్చి అక్కడ గుమిగూడిన అభిమానులను చూసిన విజయ్ చిరునవ్వుతో చేతులు ఊపారు. చేతులు జోడించి అభివాదం చేస్తూ, గాల్లో ముద్దులు విసిరి అభిమానులకు భావోద్వేగంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన బూడిద రంగు టీ-షర్టు, లేత గోధుమ రంగు జాకెట్, డెనిమ్స్‌లో సింపుల్ లుక్‌లో కనిపించారు. మరో వీడియోలో అభిమానులు అందించిన బహుమతులను స్వయంగా ముందుకు వచ్చి తీసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక అభిమాని నుంచి బ్యాగ్, మరో వ్యక్తి నుంచి బొకే తీసుకున్న విజయ్, అభిమానుల హర్షధ్వానాలకు చేతులు ఊపుతూ స్పందించారు. ఈ దృశ్యాలు అభిమానులను మరింత భావోద్వేగానికి గురిచేశాయి.
అయితే మలేషియా నుండి చెన్నై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న సమయంలో ఆయన కోసం భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. అభిమానులు ఒక్కసారిగా విజయ్‌ని చుట్టుముట్టడం, ఆ గందరగోళంలో కారు ఎక్కుతుండగా, ఒక్కసారిగా స్లిప్ అయి పడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఘటనలో విజయ్‌కి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. విజయ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉండగా, డిసెంబర్ 27న కౌలాలంపూర్‌లోని బుకిట్ జలీల్ స్టేడియంలో జరిగిన ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ ఈవెంట్‌కు దాదాపు లక్ష మంది హాజరయ్యారు. అత్యధిక ప్రేక్షకులు పాల్గొన్న ఆడియో లాంచ్‌గా ఇది మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. శ్రీలంక తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద తమిళ ప్రవాసుల జనాభా మలేషియాలో ఉండటం విశేషం.
VIDEO | TVK chief Vijay stumbled and fell while trying to get into his car at the Chennai airport.
A large crowd of fans gathered to welcome him as he returned from Malaysia.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/x42Kpd0AsW
— Press Trust of India (@PTI_News) December 28, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ పీజీ, ఎంబీఏ సెమిస్టర్ ఫలితాలు విడుదల
Jailer 2 | ఓటీటీ వివాదం.. ఆ మల్టీప్లెక్స్‌లలో ‘జైలర్ 2’ హిందీ వెర్షన్‌కు నో ఎంట్రీ!
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహణ ఎంతో అవసరం
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

