Tanuja | బిగ్ బాస్ సీజన్ 9 ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ అందరూ తమ తమ పనుల్లో బిజీ అయిపోయారు. కొంతమంది కొత్త ప్రాజెక్టులతో ముందుకు వెళ్తుండగా, మరికొంతమంది స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా సమయం గడుపుతున్నారు. అయితే, ఈ సీజన్లో రన్నరప్‌గా నిలిచిన తనూజ పుట్టస్వామి మాత్రం మిగతా వారికంటే భిన్నమైన నిర్ణయంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. షో ముగిసిన వెంటనే పార్టీల్లో, పబ్లిక్ ఈవెంట్స్‌లో కనిపించకుండా, ఒక రోజు మొత్తాన్ని అనాధ పిల్లలతో గడిపి అందరి మనసులను గెలుచుకుంది. అనాధాశ్రమానికి వెళ్లిన తనూజ అక్కడి పిల్లలతో కలిసి ఆడుతూ, పాడుతూ, వారితో కలిసి భోజనం చేసి ఎంతో ఆనందంగా సమయం గడిపింది.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ తనూజపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “నిజంగా నువ్వు గ్రేట్ తనూజ”, “నువ్వే అసలు విన్నర్ కావాల్సింది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఒక్క వీడియోతోనే ఆమెపై సోషల్ మీడియాలో క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇక బిగ్ బాస్ అనంతరం చాలా మంది కంటెస్టెంట్స్ మీడియా ఇంటర్వ్యూలు, టీవీ షోలతో బిజీగా కనిపిస్తుంటే, తనూజ మాత్రం ఎక్కడా కనిపించకపోవడం ఆసక్తికరంగా మారింది.ఇక ఇటీవల వచ్చే ఆదివారం టెలికాస్ట్ కానున్న ఓ ప్రత్యేక షో షూటింగ్ జరిగింది. ఈ షూట్‌కు బిగ్ బాస్ సీజన్ 9కు చెందిన దాదాపు అందరు కంటెస్టెంట్స్ హాజరయ్యారు. కానీ, తనూజ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉండిపోయింది.
దీనికి కారణం ఆమె స్వయంగా కొంతకాలం షోలు, మీడియా నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ సమయంలో కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని ఆమె భావిస్తోందట. అందుకే కావాలని చిన్న గ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో తనూజకు మంచి ఆఫర్స్ కూడా వస్తున్నాయని, కానీ ఆమె తొందరపడకుండా వాటిని సున్నితంగా తిరస్కరిస్తోందని టాక్. ఈ నిర్ణయానికి కూడా ఆమె ఫ్యాన్స్ నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. బిగ్ బాస్‌లో మాత్రమే కాదు, బయట కూడా తన ఆలోచనలు, చర్యలతో తనూజ నిజమైన విన్నర్లా నిలుస్తోందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.