Nizampet | నిజాంపేట్, జులై 22 : సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలోని ఆయుర్వేదిక్ దవాఖానలో నూతన మెడికల్ అధికారిణి డాక్టర్ విజేత బాధ్యతలు చేపట్టారు. ఇది వరకు కంగ్టిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నారాయణరావు నిజాంపేట్ మండలంలోని ఆయుర్వేదిక్ దవాఖానాలో ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. మంగళవారం నూతనంగా వచ్చిన డాక్టర్ విజేతకు ఆయన బాధ్యతలు అప్పగించారు.
నారాయణ రావు కంగ్టి దవాఖానలో విధులు నిర్వహిస్తూ నిజాంపేట్ దవాఖానకు ఇంచార్జీగా వ్యవహరిస్తూ గ్రామ ప్రజల మన్ననలు పొందారు. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు కూడా ఆయుర్వేదిక్ దవాఖానకు రావడం వారి ద్వారా వైద్య సేవలు చేయించుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నుండి మెడికల్ అధికారిణి డాక్టర్ విజేత రావడంతో ఆయన ఈ రోజు పూర్తి బాధ్యతలు అందించడం జరిగింది.
గ్రామస్తులు డా నారాయణ రావుకు వీడుకోలు పలుకుతూ డా.విజేతకు శాలువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సాయిరెడ్డి, మాజీ సర్పంచ్ జగదీశ్వర్ చారి, గ్రామస్తులు రాము, దుర్గయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Kanwar Yatra: కన్వర్ యాత్ర మార్గాల్లోని హోటళ్లు లైసెన్సులు డిస్ప్లే చేయాలి: సుప్రీంకోర్టు
TTD key decisions | టీటీడీ కీలక నిర్ణయాలు.. సైబర్ క్రైమ్ లాబ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
Crime news | అత్యాచారం చేశాడంటూ డెలివరీ బాయ్‌పై మహిళా టెక్కీ తప్పుడు ఫిర్యాదు.. తర్వాత ఏమైందంటే..!