న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో కన్వర్ యాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో దాఖలైన ఓ పిటీషన్‌పై స్పందిస్తూ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. క్యూఆర్ కోడ్‌ను హోటళ్ల వద్ద పెట్టాలని యూపీ సర్కార్ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అయితే కన్వర్ యాత్ర మార్గంలో ఉన్న హోటళ్లు అన్నీ తమ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు డిస్ప్లే చేయాలని ఆదేశించింది. జస్టిస్ ఎంఎం సుందరేశ్, ఎన్ కోటేశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఇవాళ వాదనలు విన్నది. హోటళ్ల పేర్లను డిస్ప్లే చేయడం కానీ, దాబా ఓనర్ కానీ, క్యూఆర్ కోడ్ అంశాల్లోకి కానీ వెళ్లడం లేదని కోర్టు చెప్పింది.
కన్వర్ యాత్ర నేటితో ముగియనున్నదని, ఇవాళ చివరి రోజు అని, ఈ దశలో హోటళ్ల కేవలం తమ లైసెన్సులు డిస్ప్లే చేయాలని ఆదేశిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. హోటళ్లలో ఎటువంటి పదార్ధాలను వాడుతున్నారు,గతంలో ఆ హోటల్లో మాంసారం వడ్డించారా అని తెలుసుకునే హక్కు కస్టమర్లకు ఉన్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. యాత్ర ఇవాళే ఆఖరి కాబట్టి క్యూఆర్ కోడ్ అంశం లోతుల్లోకి వెళ్లడం లేదని కోర్టు చెప్పింది.