Crime news : డెలివరీ బాయ్ (Delivery boy) తనపై అత్యాచారం చేశాడని ఈ నెల తొలి వారంలో తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళా టెకీ (Woman tecchie) పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపిన తర్వాత నిందితురాలిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డెలివరీ ఏజెంట్గా వచ్చిన ఒక వ్యక్తి తన ఫ్లాట్లోకి చొరబడి తనపై అత్యాచారం చేశాడని ఈ నెల 3న 22 ఏళ్ల మహిళా టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆ తర్వాత తాను స్పృహ కోల్పోయేలా చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేగాక అతడు తన ఫొటోలు తీశాడని, ఈ విషయం బయటకు చెబితే సామాజిక మాధ్యమాలలో పోస్టు చేస్తానని బెదిరించాడని పోలీసులకు చెప్పింది. తన ఆరోపణలకు రుజువుగా ఆమె కొన్ని సాక్ష్యాలను కూడా సమర్పించింది. అయితే, పోలీసులు లోతుగా విచారణ చేయంతో మహిళా టెక్కీ అబద్ధపు ఫిర్యాదు చేసిందని తేలింది.
డెలివరీ ఏజెంట్గా వచ్చిన వ్యక్తి ఆమె స్నేహితుడేనని పోలీసుల గుర్తించారు. ఆమెపై ఎలాంటి అఘాయిత్యం జరగలేదని, కావాలనే పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసిందని విచారణలో వెల్లడైంది. దాంతో పోలీసులు ఆమె పైనే కేసు నమోదు చేశారు. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.