Maria Farmer | ‘ఆ రాత్రి డొనాల్డ్ ట్రంప్‌తో నాకు చేదు అనుభవం’.. వెల్లడించిన నటి మారియా ఫార్మర్
Maria Farmer | అమెరికా అధ్యక్షుడు (USA President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తో ఓ రాత్రి తనకు చేదు అనుభవం ఎదురైందని నటి మారియా ఫార్మర్ (Maria Farmer) వెల్లడించారు. జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) కార్యాలయంలో ఒక రోజు రాత్రి ట్రంప్ తనను అదోలా చూశారని ఆమె ఆరోపించారు.
Maria Farmer : అమెరికా అధ్యక్షుడు (USA President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తో ఓ రాత్రి తనకు చేదు అనుభవం ఎదురైందని నటి మారియా ఫార్మర్ (Maria Farmer) వెల్లడించారు. జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) కార్యాలయంలో ఒక రోజు రాత్రి ట్రంప్ తనను అదోలా చూశారని ఆమె ఆరోపించారు. ఎప్స్టీన్తో కలిసి పనిచేసేందుకు సిద్ధపడ్డ సమయంలో ఒక రాత్రి ట్రంప్ తనకు ఆయన ఫోన్ చేశారని మారియా చెప్పారు.
అర్జెంటుగా ఆఫీస్‌కు రమ్మనడంతో నైట్ డ్రెస్‌లోనే తాను ఆయన దగ్గరకు వెళ్లానని మారియా చెప్పారు. అప్పటికే ఎప్స్టీన్ కార్యాలయంలో ఉన్న ట్రంప్ తన శరీరాన్ని అదోలా చూశారని, తాను షార్ట్స్ ధరించడంతో కాళ్లవైపే చూస్తూ ఉండిపోయారని చెప్పారు. ఈ ఘటన 1995లో జరిగిందని, అప్పుడు తన వయసు 20 ఏళ్లు ఉంటుందని మారియా తెలిపారు. ట్రంప్ తన కాళ్లవైపే చూస్తుండగా అక్కడికి వచ్చిన ఎప్స్టీన్ అది చూసి.. ‘నోనో.. ఆమె నీకోసం కాదు’ అని ట్రంప్‌తో చెప్పారని తెలిపారు.
కాగా జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ కుంభకోణానికి సంబంధించిన ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల చేయాలని అమెరికావ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి మారియా ఫార్మర్ 1996లోనే ఎప్స్టీన్, మ్యాక్స్‌వెల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. వారు సెక్స్ ట్రాఫికింగ్ చేస్తున్నారని మీడియాకు వెల్లడించారు. ఇప్పుడు ఏకంగా డొనాల్డ్ ట్రంప్‌పై ఆరోపణలు చేశారు.
మారియా ఆరోపణలపై వైట్‌హౌస్ స్పందిస్తూ.. ఎప్స్టీన్తో స్నేహాన్ని ట్రంప్ వదిలేసి చాలాకాలం అవుతోందని పేర్కొంది. ట్రంప్ ఏనాడూ ఎప్స్టీన్ ఆఫీస్‌కు వెళ్లలేదని వైట్‌హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ వెల్లడించారు.
Read More >>
ఉపరాష్ట్రపతి రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం.. రాజ్యసభకు తెలిపిన హోంశాఖ
పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీల నిరసన.. ఎందుకంటే..!
పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
ఢాకాలో స్కూల్‌పై కూలిన విమానం.. 27కు పెరిగిన మృతుల సంఖ్య
టెట్ ఫలితాలు విడుదల.. 33.98 శాతం ఉత్తీర్ణత
పవన్,ఏఎం రత్నంపై ప్రశంసలు కురిపిస్తూ క్రిష్ ట్వీట్.. చిత్రానికి ఊపిరి ఇచ్చింది ఆయనే..!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

