Bangladesh | బంగ్లాదేశ్ (Bangladesh) వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం (Bangladesh Air Force training fighter jet) సోమవారం ఢాకా (Dhaka)లోని ఓ స్కూలు భవనం (school building)పై కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం మేరకు ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 27కు పెరిగింది. వారిలో 25 మంది చిన్నారులు కాగా, ఇద్దరు టీచర్లు. మరో 171 మంది గాయపడ్డారు. ‘శిక్షణ విమానం కూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 27కి చేరింది. వారిలో 25 మంది విద్యార్థులే’ అని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ సలహాదారు సైదుర్ రెహమాన్ తెలిపారు.
ఢాకాలోని ఉత్తర ప్రాంతంలో గల మైల్స్టోన్ పాఠశాల, కళాశాలపై చైనా తయారీ ఎఫ్-7 శిక్షణ విమానం కూలిపోయింది. తరగతులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం కూలిపోయిన తర్వాత మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించిన దృశ్యాలు టెలివిజన్‌లో ప్రసారమయ్యాయి. క్షతగాత్రులను నగరంలోని ఆరు దవాఖానాలకు సహాయక సిబ్బంది తరలించారు. బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన ఎస్-7 శిక్షణ విమానం ఢాకాలోని ఉత్తరలో కూలిపోయిందని, మధ్యాహ్నం 1.06 గంటలకు విమానం టేకాఫ్ అయిందని సైన్యానికి చెందిన ప్రజా సంబంధాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read..
Gita Gopinath | ఐఎంఎఫ్‌ను నుంచి వైదొలగనున్న గీతా గోపీనాథ్
ఢాకాలో స్కూల్‌పై కూలిన విమానం… 16 మంది విద్యార్థులు సహా 20 మంది దుర్మరణం
Firing | అభాగ్యులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు.. 90 మంది మృతి