Gita Gopinath | అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund)లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న గీతా గోపీనాథ్ (Gita Gopinath) త్వరలో ఆ పదవి నుంచి వైదొలగనున్నారు. ఆగస్టులో ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి గీతా గోపినాథ్ దిగిపోనున్నట్లు ఐఎంఎఫ్ అధికారికంగా ప్రకటించింది. ఆమె స్థానంలో ఆ పదవి చేపట్టే వ్యక్తి ఎవరన్నది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా (Kristalina Georgieva).. గీతా గోపీనాథ్ నిష్క్రమణను ధ్రువీకరించారు.
ఇక ఈ పదవి నుంచి వైదొలిగిన అనంతరం ఆమె తిరిగి హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University)లో ప్రొఫెసర్‌గా చేరనున్నారు. అమెరికా, భారత్‌లో పౌరసత్వం ఉన్న గీతా గోపినాథ్.. 2019 అక్టోబర్‌లో ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్‌గా నియమితులయ్యారు. ఐఎంఎఫ్ చరిత్రలో ఆ బాధ్యతలు చేపట్టిన తొలిమహిళగా నిలిచారు. 2022 జనవరిలో ఆమెకు ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి లభించిన విషయం తెలిసిందే.
Also Read..
Encounter | బీహార్ గ్యాంగ్‌స్టర్ హత్యకేసు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు అనుమానితులకు గాయాలు
Earthquake | హర్యానాలో భూకంపం.. ఢిల్లో ప్రకంపనలు
కూరగాయల వ్యాపారికి రూ.29 లక్షల జీఎస్టీ నోటీస్