బెంగళూరు: కర్ణాటకలోని హవేరీలో చిన్నపాటి కూరగాయల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తికి రూ.29 లక్షలు కట్టాలంటూ జీఎస్టీ నోటీస్ జారీఅయ్యింది. తనకు వచ్చిన ఆ నోటీస్ చూసి దుకాణందారు శంకరగౌడ షాక్కు గురయ్యాడు. ఇంతపెద్ద మొత్తంలో తనకు జీఎస్టీ నోటీసు రావటమేంటి?, దీనిని చెల్లించటం తనకు అసాధ్యమని వాపోయాడు.
జీఎస్టీ నిబంధనల ప్రకారం, రైతుల నుంచి తాజా కూరగాయలు కొనుగోలు చేసి, వాటిని ప్రాసెస్ చేయకుండా యథాతథంగా అమ్మితే.. వాటిపై ఎలాంటి జీఎస్టీ ఉండదు. అయితే శంకరగౌడ విషయంలో యూపీఐ, ఇతర డిజిటల్ లావాదేవీలను లెక్కలోకి తీసుకొని అధికారులు నోటీసులు జారీచేసినట్టు తెలిసింది. అతడి ఖాతాలో ఆర్థిక లావాదేవీలు రూ.1.63కోట్ల వరకు ఉన్నాయని తేలింది.