Encounter | గతవారం పాట్నా ఆస్పత్రిలో గ్యాంగ్‌స్టర్‌పై కాల్పుల (Bihar gangsters murder) ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గ్యాంగ్‌స్టర్‌పై ఐదుగురు వ్యక్తులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆరా పట్టణంలో పోలీసుల ఎన్కౌంటర్ (police encounter)లో ఇద్దరు అనుమానితులకు గాయాలయ్యాయి.
ఈనెల 17న పాట్నాలో ఉన్న పారస్ హెచ్ఎంఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గ్యాంగ్‌స్టర్ చందన్ మిశ్రా (Chandan Mishra)పై హత్యాయత్నం జరిగింది. ఐదుగురు వ్యక్తులు తుపాకులతో వచ్చి మిశ్రాపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో మిశ్రా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పాట్నా పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి ఈ కేసుకు సంబంధం ఉన్న నేరస్థులను పట్టుకునేందుకు పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఆరా పట్టణంలోని బిహియా సమీపంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల ఎన్కౌంటర్లో మిశ్రా హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలైనట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. గాయపడినవారిని బల్వంత్, రవిరంజన్గా పోలీసులు గుర్తించారు.
CCTV footage of Chandan Mishra’s murder inside Paras Hospital (Patna) has surfaced.
He was brutally shot inside the hospital premises.
Where is the security? Where is Bihar heading?#ParasHospital #ChandanMishra #Bihar pic.twitter.com/ZZZP95PYje— Tarun Choubey 🇮🇳 (@Tarunchoubey4) July 17, 2025
Also Read..
Earthquake | హర్యానాలో భూకంపం.. ఢిల్లో ప్రకంపనలు
కూరగాయల వ్యాపారికి రూ.29 లక్షల జీఎస్టీ నోటీస్
పహల్గాంపై దద్దరిల్లిన పార్లమెంట్.. చర్చకు పట్టుబట్టిన విపక్షాలు