Jagdeep Dhankhar : భారత ఉపరాష్ట్రపతి (Vice president) జగదీప్ ధన్కడ్ (Jagdeep Dhankhar) రాజీనామాకు రాష్ట్రపతి (President of India) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆమోదం తెలిపారు. ఆ తర్వాత ఆ రాజీనామాను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (Union Home Ministry) కి పంపారు. అనంతరం రాజ్యాంగంలోని ఆర్టికల్ 67A కింద ఉపరాష్ట్రపతి రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన విషయాన్ని కేంద్ర హోంశాఖ రాజ్యసభకు తెలియజేసింది.
హోంశాఖ ఇచ్చిన సమాచారాన్ని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ శ్రీ ఘన్శ్యామ్ తివారీకి సభలోని సభ్యులకు తెలియజేశారు. కాగా జగదీప్ ధన్కడ్ ఆనారోగ్య కారణాలు చూపుతూ సోమవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాకు ఇవాళ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఉపరాష్ట్రపతి రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన విషయాన్ని సభ్యులకు తెలియజేసిన తర్వాత రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
#WATCH | Delhi: Ministry of Home Affairs has conveyed resignation of Vice President of India Jagdeep Dhankhar under Article 67A of the Constitution with immediate effect pic.twitter.com/kUyzsyS2mU
— ANI (@ANI) July 22, 2025