Explosion : పటాకుల ఫ్యాక్టరీ (fireworks unit ) లో పేలుడు సంభవించడంతో ముగ్గురు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని శివకాశి (Sivakasi) సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకోవడంతో ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
తామంతా పటాకుల తయారీ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ఊహించని రీతిలో ఒక్కసారిగా పేలుడు సంభవించిందని, భారీ శబ్దంతో పేలుడు సంభవించంతో తాము భయంతో పరుగులు తీశామని ఘటనలో గాయపడిన నాగలక్ష్మి అనే మహిళ చెప్పారు. తమకు సరైన వైద్యసదుపాయం కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
#WATCH | Tamil Nadu: An explosion occurred at a firecracker manufacturing factory near Sivakasi.
(Visuals from the spot) pic.twitter.com/itFtlECru4
— ANI (@ANI) July 21, 2025