Protest : పార్లమెంట్ (Parliament) భవనం ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు (Opposition MPs) నిరసన ప్రదర్శన చేశారు. లోక్‌సభ (Loksabha) లో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్‌గాంధీ (Rahul Gandhi), సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) సహా ప్రతిపక్ష ఎంపీలంతా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీలు నినాదాలు చేశారు.
పార్లమెంట్ మకర ద్వారం ముందు ఎంపీల నిరసన ప్రదర్శన జరిగింది. బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ (SIR) పేరుతో ఓటర్ల జాబితాను సవరించడానికి వ్యతిరేకంగా వారు నిరసన వ్యక్తంచేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ పేరుతో ఎన్నికల సంఘం అధికార బీజేపీ వ్యతిరేక ఓటర్లను జాబితా నుంచి తొలగించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
#WATCH | Delhi: Opposition MPs including Lok Sabha LoP Rahul Gandhi, Samajwadi Party chief Akhilesh Yadav, protest at Makar Dwar of Parliament over the issue of SIR (Special Intensive Review) exercise in Bihar. pic.twitter.com/VqlzlJryFK
— ANI (@ANI) July 22, 2025