EX MLA Bhupal reddy | కల్హేర్, మార్చి 31: కాంగ్రెస్ నాయకులు ఎవరినో ఉసిగొలిపి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను హత్య చేయించడం పిరికిపంద చర్య అని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. హత్య రాజకీయాలను మానుకొని ప్రజల సంక్షేమానికి పాటుపడాలని ఆయన హితవు పలికారు.
కల్హేర్ మండల పరిధిలోని కొత్తచెరువు తండాకు చెందిన విస్లవత్ హరిసింగ్ ఆదివారం రాత్రి కల్హేర్ పొమ్యానాయక్ తండా మధ్య నీలంవాగు వద్ద హత్య గురయ్యాడు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని తండావాసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు అరాచకాలను నిలిపి వేయకపోతే ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. హరిసింగ్ పార్టీపై అభిమానంతో బీఆర్ఎస్ జిందాబాద్, మాజీ సీఎం కేసీఆర్ దేవుడని, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మళ్లీ గెలుస్తారని అందరి ముందు నినాదాలు చేసేవాడన్నారు. జిందాబాద్‌లు, నినాదాలను జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు ఎవరినో ఉసిగొలిపి దారుణంగా హత్య చేయించారని ధ్వజమెత్తారు. హంతకులను పట్టుకోవడానికి డాగ్‌స్వ్కాడ్, క్లూస్ టీంను తెప్పించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
హంతకులు ఎంతటి వారైనా పోలీసులు పట్టుకొని కఠినంగా శిక్షించాలన్నారు. హత్య కేసును పోలీసులు తొందరగా ఛేదిస్తారని నమ్మకం ఉందన్నారు. వీరి వెంట మాజీ జడ్పీటీసీ నర్సింహరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రాంసింగ్, మాజీ ఎంపీటీసీ సంగప్ప, నాయకులు జలంధర్, బాలయ్య, సాయిలు, నర్సింహగౌడ్, హన్మంత్‌రావు, ప్రభుగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, గణపతి, లక్ష్మన్, పండరి, విఠల్ తదితరులు ఉన్నారు.
AP News | వారం రోజుల నుంచి గుడి ముందు నగ్నంగా పూజలు.. ఉగాది రోజు సజీవ సమాధికి యత్నం!
Jagadish Reddy | ఆ భాషే ఆయన్ను బొందపెడుతుంది.. సీఎం రేవంత్ రెడ్డిపై జగదీశ్ రెడ్డి ధ్వజం