Murder | సంగారెడ్డి, డిసెంబర్ 25: సంగారెడ్డి జిల్లాలోని కొల్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగు చూసింది. తల్లీ, కొడుకు దారుణంగా హత్యకు గురయ్యారు. దాడిలో కత్తి పోట్లతో మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.
ఘటనాస్థలానికి చేరుకున్న కొల్లూర్ పోలీసులు తీవ్ర గాయాలతో రక్తస్రావం అవుతున్న వ్యక్తిని చికిత్స కోసం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతులను చంద్రకళ (30), రేవంత్ (14) గా గుర్తించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు పాల్పడిన వ్యక్తి కోసం కొల్లూర్ పోలీసులు క్లూస్ టీంతో కలిసి గాలింపు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Jagadish Reddy | రేవంత్‌రెడ్డి కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోడు : జగదీశ్‌రెడ్డి
Bus overturns | మహబూబ్‌నగర్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు : వీడియో
Hrithik Roshan | పెళ్లి వేడుకలో కుమారులతో కలిసి స్టెప్పులేసిన హృతిక్ రోషన్… వీడియో వైరల్