జడ్చర్ల, డిసెంబర్ 25 : మహబూబ్‌నగర్ జిల్లా బాలా నగర్ వద్ద స్కూల్ బస్సు బోల్తా పడింది. పలువురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట జిల్లా మరికల్ లోని మణికంఠ జూనియర్ కాలేజీకి చెందిన బస్సు విహారయాత్రకు వెళుతుండగా బోల్తా పడింది. హైదరాబాద్‌లోని జలవిహార్‌కు వెళ్లేందుకు కాలేజీకి చెందిన బస్సులో ప్రయాణిస్తున్నారు.
ఈ క్రమంలో బాలా నగర్ వద్ద హైదరాబాద్-బెంగళూరు హైవేపై ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు స్వల్ప గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.