హిమాయత్‌నగర్, మార్చి17: సమాజ ఆరోగ్య పరిరక్షణ కోసం నిత్యం సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యులపై కాంగ్రెస్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ ఆరోపించారు. మంగళవారం హైదర్‌గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. నిత్యం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి రాత్రనక పగలనక రోగులకు ప్రాథమిక చికిత్స అందిస్తున్న వైద్యుల సమస్యలను పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలకు పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లను జారీచేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా జీఓ నం 1273 ప్రకారం శిక్షణ ఇచ్చిన ఆర్ఎంపీ, పీఎంపీలకు పరీక్షలు నిర్వహించి సరిఫికెట్లు ఇవ్వాలన్నారు.
ఏప్రిల్ మాసంలో హైదరాబాద్‌లో నిర్వహించే ఆర్పీల ఆత్మగౌరవ సభకు సిద్ధం కావాలని గ్రామీణ వైద్యులకు పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం మోహన్,ఉపాధ్యక్షులు తన్నీరు సత్యనారాయణ, పిట్టల నాగేశ్వరరావు,కోశాధికారి లెక్కల నగేష్,రాష్ట్ర కార్యదర్శి దాసు శంకరయ్య, నేతలు రవీందర్,వెంకటాచారి, భరత్, సుదర్శన్, నవీన్ కుమార్,శ్రీనివాస్, మిద్దె వెంకటేశ్, మురళీగౌడ్, కృష్ణ, వెంకటేశ్వర్లు,సి. హెచ్.శ్రీనివాస్ తదితరులు పాల్గొ న్నారు.