సిటీ బ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ప్రముఖ నగల దుకాణం జోస్ అలుక్కాస్ ఆన్లైన్ స్టోర్లో వర్చువల్ ట్రైఆన్ అగ్మెంటెడ్ రియాలిటీ ఫీచర్ను ప్రవేశపెట్టినట్లు సంస్థ ఎండీ జాస్ అలుక్కాస్ వెల్లడించారు.
కొత్త ఏఆర్ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ కెమెరాను ఉపయోగించి ఆభరణాల వాస్తవికతను చూడవచ్చని తెలిపారు. కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు మరింత మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. నాణ్యమైన నగలు అందిస్తున్నామన్నారు. నూతన సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.