బేగంపేట, మార్చి 17 : కిమ్స్ దవాఖాన వైద్యులు అరుదైన చికిత్స చేశారు. తీవ్రమైన వినికిడి లోపంతో బాధపడుతున్న మూడేండ్ల చిన్నారికి విజయవంతంగా స్మార్ట్ కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స నిర్వహించి సరికొత్త జీవితాన్ని ప్రసాదించింది.
అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ చికిత్సను మన దేశంలో నిర్వహించడం ఇదే తొలిసారని కిమ్స్ వైద్యులు వెల్లడించారు. వినికిడి లోపంతో బాధపడుతున్న పిల్లలకు చిన్న వయసులోనే కాక్లియర్ ఇంప్లాంట్ చేయడం వల్ల వినికిడి సామర్థ్యం మెరుగుపడటంతోపాటు మాటలు నేర్చుకునే సామర్థ్యం, భాషాభివృద్ధి సాధారణ స్థాయికి చేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.