Hrithik Roshan | బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే ‘వార్ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, నటనతో పాటు డ్యాన్స్‌లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. దేశంలో బెస్ట్ డ్యాన్సర్ల జాబితా తీస్తే తప్పకుండా హృతిక్ రోషన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆయన స్టైలిష్ స్టెప్పులకు ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఉంది. చాలా కాలం తర్వాత హృతిక్ రియల్ లైఫ్‌లో తనదైన డ్యాన్స్ స్టెప్పులతో అభిమానులను ఆకట్టుకున్నారు. తాజాగా ఓ పెళ్లి వేడుకలో తన ఇద్దరు కుమారులు హ్రేహాన్, హృదాన్‌తో కలిసి డ్యాన్స్ చేసి సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ పెళ్లి వేడుక హృతిక్ రోషన్ మామయ్య కుమారుడు ఇషాన్ రోషన్ది కాగా, రెండు రోజుల క్రితం ముంబైలో గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హృతిక్ తన ప్రేయసి సబా ఆజాద్‌తో కలిసి సందడి చేశారు. అలాగే హృతిక్ మాజీ భార్య సుస్సానే ఖాన్ కూడా తన ఇద్దరు కుమారులతో కలిసి ఈ పెళ్లిలో పాల్గొన్నారు. సంగీత్ వేడుక సందర్భంగా హృతిక్ తన కుమారులతో కలిసి హిందీ పాటకు డ్యాన్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హృతిక్ తన ఎనర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టడమే కాకుండా, ఆయన కుమారులు కూడా తండ్రికి ఏమాత్రం తీసిపోకుండా డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తండ్రితో పోటీ పడుతూ మరీ స్టెప్పులు వేయడం అక్కడి అతిథులను విశేషంగా అలరించింది.
ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు “ఇదే నిజమైన హృతిక్ స్టైల్”, “డ్యాన్స్ అంటే హృతిక్ ఫ్యామిలీదే” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, త్వరలోనే హృతిక్ కుమారులు కూడా సినీరంగంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. మొత్తానికి, వెండితెరపైనే కాదు… వ్యక్తిగత జీవితంలోనూ డ్యాన్స్‌తోనే అభిమానులను మెప్పించగల స్టార్‌గా హృతిక్ రోషన్ మరోసారి నిరూపించారు.
Damn 😱 Gotta get lighter on my feet to keep up 🕺🏻 pic.twitter.com/UFnHNEIR7p
— Hrithik Roshan (@iHrithik) December 25, 2025