PadmaDevenderReddy | నిజాంపేట, నవంబర్ 12 : నిజాంపేట మండలంలోని బచ్చురాజు పల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ మల్లేశం తండ్రి ఎర్ర మల్లయ్య(80) అనారోగ్యంతో మృతి చెందాడు. స్థానిక బీఆర్ఎస్ నేతల ద్వారా ఈ విషయం తెలుసుకున్న మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బుధవారం బచ్చురాజుపల్లి గ్రామానికి విచ్చేసి మృతుని అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
అంతకముందు నస్కల్ గ్రామానికి చెందిన లాలాగౌడ్ విద్యుత్ షాక్తో మృతి చెందగా.. బాధిత కుటుంబ సభ్యులను పద్మా దేవేందర్ రెడ్డి పరామర్శించారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ సంపత్, నిజాంపేట పీఏసీఎస్ మాజీ చైర్మన్ కిష్టరెడ్డి, అబ్దుల్ అజీజ్ గౌస్, బీఆర్ఎస్ నాయకులు యాదగిరి, వెంకటస్వామి గౌడ్, నరేందర్ నాయక్, సుభాష్ నాయక్, పత్తి నాయక్, రాజు, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.
Dharmasagar | యూనియన్ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : బ్యాంక్ మేనేజర్ అనిల్
Madhira : లడకబజార్లో ఉచిత వైద్య శిబిరం