MLA Manikrao | జహీరాబాద్, ఏప్రిల్ 30: నిమ్జ్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న బాధిత రైతులకు మెరుగైన పరిహారాన్ని అందించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ పరిహారాన్ని చెల్లించడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ఝరాసంఘం మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన బాధిత రైతుల నుంచి నిమ్జ్ ప్రాజెక్టు కోసం భూములు సేకరించారు. సేకరించిన భూములకు పరిహారం, చెల్లింపులు పట్టా ప్రభుత్వ భూములకు సంబంధించి తేడాలు ఉండడంతో రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మెరుగైన పరిహారాన్ని చెల్లించాలని బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రైతుల గోడును విన్న హైకోర్టు బాధిత రైతులకు మెరుగైన పరిహారాన్ని చెల్లించాలని నిమ్జ్ ప్రాజెక్టు అధికారులను ఆదేశించింది. ఈ విషయంలో బాధిత రైతులు పరిహారం కోసం సంబంధిత అధికారులను ఆశ్రయించినా.. చెల్లింపు విషయంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. దీంతో బాధిత రైతులు ఇవాళ జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే బాధిత రైతులతో కలిసి నిమ్జ్ ప్రాజెక్టు కార్యాలయానికి తల్లి వెళ్లారు.
స్థానిక నిమ్జ్ ప్రాజెక్ట్ డిప్యూటీ కలెక్టర్ రాజుతోఎమ్మెల్యే బాధిత రైతుల పరిహారం విషయమై మాట్లాడారు. బాధిత రైతులకు పరిహారాన్ని చెల్లించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. బాధిత రైతులను కార్యాలయం చుట్టూ తిప్పించుకోవడం సరికాదన్నారు. వెంటనే తగు చర్యలు తీసుకొని బాధిత రైతులకు పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.
మే 4వ తేదీన ఝరాసంఘంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి బాధిత రైతులకు పరిహారం అందజేస్తామని నిమ్జ్ ప్రాజెక్ట్ డిప్యూటీ కలెక్టర్ రాజు చెప్పారు. ఎమ్మెల్యే వెంబడి జహీరాబాద్, ఝరాసంఘం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, వెంకటేశం, బాధిత రైతులు తదితరులు ఉన్నారు.
Mark Carney | ‘కార్నీ’వాల్.. టైమ్ టు విన్ పాటకు స్టెప్పులేసిన కెనడా ప్రధాని.. VIDEO
Dr. Haripriya | వైద్య సిబ్బంది గ్రామాలకు వెళ్లాలి : డాక్టర్ హరిప్రియ
CITU | కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం