MLA Manik rao | ఝరాసంగం, జనవరి25: ఝరాసంగం మండల కేంద్రంలోని బుడుగ జంగం కాలనీకి ఎమ్మెల్యే మాణిక్రావు, డీజీఎంఎస్ చైర్మన్ శివకుమార్ చొరవతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. కాలనీలో తాగునీటి సదుపాయం కల్పించాలని ఇటీవల కాలనీవాసులు ఎమ్మెల్యేను కోరగా.. ఆయన వెంటనే స్పందించి బుడుగ జంగం కాలనీలో నూతనంగా బోరు వేయించారు.
ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే, చైర్మన్ బోరుబావి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సర్పంచ్ వినోద- బాలరాజ్, ఉపసర్పంచ్ మమత- అనిల్ పటేల్ ఆధ్వర్యంలో నీటి బోరును ప్రారంభించారు. తాగునీటి కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నకాలనీవాసులకు బోరు ద్వారా వస్తున్న నీటిని చూసి ఆనందానికి అంతులేకుండా పోయాయి. ఎమ్మెల్యే, చైర్మన్ తాగునీటి సమస్యను పరిష్కరించిన ఉపకారాన్ని ఎప్పటికీ మరవలేమని గ్రామస్థులు, కాలనీవాసులు అన్నారు. ఈ సందర్భంగా వారికి గ్రామస్థులు పూలమాల, శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్, వార్డ్ మెంబర్లు నవీన్ కుమార్, సంగమేష్, ప్రవీణ్, ప్రకాష్ సింగ్, తేజమ్మ, మాలి పటేల్ సంతోష్ కుమార్, నాగేశ్వర్ సజ్జన్, మాలి పటేల్, ఎజాస్ బాబా, మాలి పటేల్ శ్రీనివాస్, తమ్మలి విజయ్ ప్రకాష్ సింగ్ కుమార్, మహమ్మద్ అజరు, గోపాల్ కుమారి, లక్ష్మీకాంత్, ఉమేష్, ఠాగూర్ సంజు, గాజుల కృష్ణ, జావిద్ బూమ్ బూమ్, సద్దాం, నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

Man Killed Attacked Leopard | వ్యక్తిపై చిరుత దాడి.. దానిని ఎలా చంపాడంటే?
T20 World Cup | పాకిస్తాన్కు ఐసీసీ వార్నింగ్.. తోక ముడిచిన పాక్.. టీ20 జట్టు ప్రకటన
Narsapur | చిత్తారమ్మ దేవి ఆలయంలో హుండీ పగలగొట్టి నగదు దోచుకెళ్లిన దుండగులు