MLA Gudem Mahipalreddy | పటాన్ చెరు, నవంబర్ 10 : ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం కార్తీక మాసం పురస్కరించుకొని పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జేపీ కాలనీ శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో ఏర్పాటు చేసిన లక్ష బిల్వార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. శివయ్య కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు సూర్య ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

Collector Koya Sriharsha | ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు.. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష