దుబాయ్: భారత ఓపెనర్ స్మృతి మంధాన ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆస్ట్రేలియాలో ఇటీవలే ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో నిలకడగా రాణించిన స్మృతి.. 790 రేటింగ్ పాయింట్లతో దక్షిణాఫ్రికా సారథి లారా వోల్వార్ట్ (782)ను అధిగమించి మొదటి స్థానానికి దూసుకెళ్లింది. టాప్-10లో భారత్ నుంచి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 9వ స్థానంలో నిలిచింది.