బెంగళూరు: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎట్టకేలకు స్వదేశానికి చేరింది. బ్రిటన్‌లో జరుగుతున్న ఆల్‌ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ ఆడటం కోసం గతవారం భారత్ నుంచి బయల్దేరిన సింధు.. ఇరాన్ దాడులతో దుబాయ్‌లోనే నిలిచిపోయింది. అయితే మూడు రోజుల తర్వాత మంగళవారం బెంగళూరుకు చేరుకున్నట్టు ఆమె ఎక్స్ పోస్ట్‌లో తెలిపింది. ‘సురక్షితంగా బెంగళూరుకు చేరుకున్నా. గడిచిన కొన్ని రోజులు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కున్నా. తిరిగి ఇంటికొచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ కఠిన పరిస్థితుల్లో మమ్మల్ని ఇక్కడికి చేరుకునేందుకు కృషిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజతలు’ అని పేర్కొంది. లండన్‌లో ఇప్పటికే మొదలైన ఆల్‌ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీకి దూరమైనట్టు సింధు చెప్పకనే చెప్పింది. ప్రస్తుతానికి తాను విరామం తీసుకుంటానని ఆ తర్వాతే భవిష్యత్ టోర్నీలపై దృష్టి సారిస్తానని పోస్ట్‌లో తెలిపింది.