Mettu kumar yadav | పటాన్ చెరు, అక్టోబర్ 26 : పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి నుండి ఎంజీ రోడ్డు, మున్నూరుకాపు ఫంక్షన్ హాల్ వరకు జీహెచ్ఎంసీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. రూ.1.40 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.
అతి రద్దీగా ఉండే ప్రధాన మార్గము అయినందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ ఏఈ శివకుమార్, వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్ పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో పర్యటించిన కార్పొరేటర్ కాలనీవాసులతో ముచ్చటిస్థూ కాలనీలో ఇబ్బందికరంగా ఉన్న రోడ్లన్ని ప్రణాళిక బద్దంగా నిర్మాణం చేపడతామని తెలిపారు.

Read Also :
Jigris Release Announcement | విడుదల తేదీని ప్రకటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘జిగ్రీస్’
Nara Rohith | మొదలైన నారా రోహిత్ పెళ్లి పనులు.. హల్దీ వీడియో వైరల్