Maharudra Yagam | ఝరాసంగం, ఏప్రిల్ 28 : దేశాన్ని పట్టి పీడిస్తున్న దుష్ట శక్తుల నుండి విముక్తి కలిగించాలని కోరుతూ మహా రుద్రయాగాన్ని ప్రారంభించినట్లు దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి మహామండలేశ్వర్ డాక్టర్ 1008 సిద్దేశ్వరానందగిరి మహారాజ్, వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ తెలిపారు.
ఇవాళ వేద మంత్రోచ్ఛారణల మధ్య వైదిక పాఠశాల విద్యార్థులు ఈ మహా రుద్రయాగ క్రతువును ప్రారంభించారు. గణపతి పూజ, గోపూజ, యాగశాల ప్రవేశం, అనంతరం ఉదయం 10:30గంటలకు ప్రారంభమైన యాగం మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతితో ముగిసింది.
ప్రతీ రోజు యజ్ఞం నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. దేశానికి దుష్ట శక్తుల నుండి విముక్తి లభించే వరకు రుద్ర యజ్ఞం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఝరాసంగం ఎస్సై నరేష్ పాల్గొని పూర్ణాహుతి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు.
Migratory birds | పెరుంగులమ్ రిజర్వాయర్లో వలస పక్షుల సందడి.. Video
Mission Bhageeratha | మిషన్ భగీరథపై నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపే లేదు
PVNR Expressway | పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వేపై రెండు కార్లు ఢీ.. భారీగా ట్రాఫిక్ జామ్