Organ Donation | హత్నూర, జూన్ 08 : అవయవదానంతో ప్రాణదాతలు కావాలని తెలంగాణ శరీర అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురు ప్రకాష్ కోరారు. ఆదివారం హత్నూర మండలం నస్తీపూర్లో శరీర అవయవదానంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నిదానాల్లోకెల్లా అవయవదానం గొప్పదన్నారు. ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోయేముందు అవయవదానం చేస్తే 18 మంది ప్రాణాలు నిలబెట్టొచ్చని సూచించారు.
కాగా యువత సంవత్సరానికి నాలుగు సార్లు రక్తదానం చేయొచ్చని.. రక్తదానంతో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు కొన్నిరోజులపాటు జీవితాన్ని ఇచ్చినవారు అవుతారన్నారు. ప్రతి ఒక్కరూ అవయవదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.
Badibata | బడిబాట కార్యక్రమం ప్రారంభించిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ పోచయ్య
Edupayala | ఏడుపాయలలో భక్తుల సందడి
Telangana Cabinet | తెలంగాణ కేబినెట్లోకి ముగ్గురు మంత్రులు.. రాజ్భవన్లో ప్రమాణస్వీకారం పూర్తి