Plot Owners | రామచంద్రాపురం, జూన్ 16 : పైసా..పైసా కూడబెట్టి కొనుకున్న ప్లాట్లలోకి తమనే రానివ్వకుండా కొందరు ప్రైవేట్ వ్యక్తులు బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని కొల్లూర్ లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ సోమవారం పోలీసులను ఆశ్రయించారు. కొల్లూర్ ఇన్స్పెక్టర్ రవీందర్‌ని ప్లాట్ ఓనర్స్ కలిసి ఫిర్యాదు చేసి వారి బాధను చెప్పుకున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూర్ గ్రామంలో పలు సర్వేనంబర్లల్లో 1984లో చేసిన లే అవుట్లో భవిష్యత్తు అవసరాల కోసం సుమారుగా 1600 మంది ప్లాట్లు కొనుక్కోవడం జరిగిందన్నారు.
మా ప్లాట్లకు సంబంధించిన భూములపై ఇతరులు కన్నేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయడంతో న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్పారు. గతంలో లోకాయుక్తలో కూడా ప్లాట్ ఓనర్స్‌కి అనుకూలంగా తీర్పు రావడం జరిగిందన్నారు. తమ ప్లాట్లకు సంబంధించిన భూమిలోకి తమని రానివ్వకుండా గుండాలను పెట్టి తమని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్ని సంవత్సరాలుగా తమ ప్లాట్లను దక్కించుకోవడానికి తిరుగుతున్నామని, తమకు న్యాయం చేయాలని ఇన్స్పెక్టర్ రవీందర్‌ని ప్లాట్ ఓనర్స్ కోరారు. దీనికి స్పందించిన ఆయన.. ఫిర్యాదుకు లేఅవుట్, కోర్టు తీర్పుని, ఆయా సర్వేనంబర్లల్లో ఏ భూమిలో ఎంత మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నారనే లిస్ట్‌ని జత చేసి ఇస్తే దాని ప్రకారం కేసు నమోదు చేసి న్యాయం చేయడానికి తమవంతు కృషి చేస్తామని ప్లాట్ ఓనర్స్‌కి హామీ ఇచ్చారు. దీంతో ఇన్స్పెక్టర్ సూచనల మేరకు అన్ని పత్రాలను సమర్పిస్తామని, మా ప్లాట్లు మాకు దక్కెలా చూడాలని వారు కోరారు.
Inter Results | ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఫస్టియర్‌లో 67.. సెకండియర్‌లో 50శాతం పాస్
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Narsimhulapeta | ఖాజామియాకు ఆర్థిక సాయం అందజేత