వాషింగ్టన్ : పశ్చిమాసియాలో ఇరాన్‌పై సాగిస్తున్న యుద్ధానికి నిధులు సమకూర్చేందుకు 20,000 కోట్ల డాలర్లకు (రూ.18.65 లక్షల కోట్లు) పైగా నిధుల కోసం అమెరికన్ కాంగ్రెస్ చేసిన అభ్యర్థనను ఆమోదించాలని అమెరికా రక్షణ శాఖ(పెంటగాన్) వైట్ హౌస్‌ను కోరింది. వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరిని ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్టు ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే పెరుగుతున్న ఖర్చులపై ఇరాన్ అధికారులు అమెరికాను ఎద్దేవా చేశారు. ఇజ్రాయెల్ ఫస్ట్(ఇజ్రాయెల్‌కే అత్యధిక ప్రాధాన్యత) అజెం డా కోసం తమ సొంత పౌరులపై భారం మోపుతున్నారని ఆరోపిస్తూ అమెరికా అధికారులపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి విమర్శనాస్ర్తాలు సంధించారు.