హెచ్‌డీఎఫ్‌సీలో ప్రకంపనలు.. బ్యాంక్ చైర్మన్ పదవికి అటాను చక్రవర్తి రాజీనామా
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బ్యాంక్ చైర్మన్ పదవికి అటాను చక్రవర్తి రాజీనామా చేశారు.
న్యూఢిల్లీ, మార్చి 19: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బ్యాంక్ చైర్మన్ పదవికి అటాను చక్రవర్తి రాజీనామా చేశారు. గత రెండేండ్లుగా బ్యాంకులో జరుగుతున్న కొన్ని పద్దతులు, నిర్ణయాలు తన వ్యక్తిగత విలువలకు, నైతికతకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులో ఏదో తప్పు జరిగిందని ఆరోపించడం లేదు కానీ, వ్యక్తిగత భావజాలం, బ్యాంక్ అనుసరిస్తున్న పద్దతులు ఒకేలా లేకపోవడంతో తప్పుకోవాలని నిర్ణయించినట్టు ఈ నెల 17న రాసిన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 2021లో బ్యాంక్‌లో చేరిన ఆయన.. 2024లో మరో మూడేండ్లపాటు తన పదవిని పొడిగించారు.
మరోవైపు, బ్యాంక్‌లో జరుగుతున్న పరిణామాలపై వెంటనే బోర్డు సమావేశమై తాత్కాలిక నూతన చైర్మన్‌గా కేకే మిస్త్రీని ప్రకటించింది. ఈ నెల 19 నుంచి మూడు నెలల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ నియామకానికి రిజర్వు బ్యాంక్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా కేకే మిస్త్రీ మాట్లాడుతూ..బ్యాంకులో ఎలాంటి ఆధిపత్య పోరాటాలు, కార్యాచరణ లోపాలు లేవని స్పష్టంచేశారు. బ్యాంకులో జరుగుతున్న పరిణామాలపై రిజర్వు బ్యాంక్, మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన బ్యాంక్ అని, తగినంత మూలధన నిధులు ఉన్నాయని ఆర్బీఐ స్పష్టంచేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

