Hothi (k) Gurukulam | జహీరాబాద్, ఏప్రిల్ 23 : ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హోతికే తెలంగాణ బాలికల గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులతో సత్తాచాటారు. ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ర్యాంకులు సాధించారు. స్థానిక కళాశాలకు చెందిన ఏ గాయత్రి, టి ఐశ్వర్య ఎంపీసీ గ్రూప్ ప్రథమ సంవత్సరంలో 468/470 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు.
అలాగే టీ నికిత, ఎం అరవింద, ఎం స్నేహలు 467/470 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారు. వీరితోపాటు ఎం పూజ 466/470 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానంలో నిలిచింది. ఈ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ర్యాంకులు సాధించడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ సురేఖ, అధ్యాపకులు, తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
Errabelli Dayakar Rao | ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో భారీగా చేరికలు
KTR | పెంబర్తి వద్ద కేటీఆర్కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి