Bhavani matha | జహీరాబాద్, సెప్టెంబర్ 28 : ప్రముఖ శిల్పకారుడు కండ్లకు గంతలు కట్టుకొని భవానీ మాత విగ్రహాన్ని తయారు చేసి ఔరా అనిపించారు. దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని జహీరాబాద్ మండల కేంద్రం న్యాల్కల్ గ్రామానికి చెందిన ప్రముఖ శిల్పకారుడు డాక్టర్ హోతి బసవరాజ్ ఆదివారం భవాని మాత విగ్రహాన్ని తయారు చేశాడు. హోతి బసవరాజ్ కొంతకాలంగా దేవతల విగ్రహాలను తయారు చేయాలని సంకల్పాన్ని పెట్టుకున్నాడు.
గత జనవరి మాసంలో అయోధ్యలో బలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్న సమయంలో బలరాముని విగ్రహాన్ని, గత నెలలో వినాయక నవరాత్రి వేడుకల్లో భాగంగా వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు. తాజాగా భవానీమాతను తలుచుకొని ఏకాగ్రతతో విగ్రహాన్ని కేవలం 70 నిమిషాల్లోనే తయారు చేశాడు. కండ్లకు దంతాలు కట్టుకొని ఏకాగ్రతతో దేవతామూర్తులను తయారు చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం భవానీమాత విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు.
MGBS | ప్రయాణికులకు శుభవార్త.. ఎంజీబీఎస్ నుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభం