Heavy Rains | సిర్గాపూర్, అక్టోబర్ 06: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో సోమవారం తెల్లవారు జామున వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం ధాటికి వాగుల్లో వరద పెరిగి గ్రామాలు అతలాకుతలమయ్యాయి. జనజీవనం స్తంభించింది. వాసర్ ఊరవాగు వంతెన మీద నుంచి పొంగడంతో వాసర్- కంగ్టి మధ్య రాకపోకలు నిలిచాయి. వాసర్ వాగు పరిసరాల్లోని మహదేవ్ ఆలయానికి వరద తాకింది. కరెంటు స్తంభాలు వాగులో కొట్టుకుపోయాయి.
వంగ్ధాల్, అంతర్గాం గ్రామాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. సిర్గాపూర్ శివారులో హై లెవల్ వంతెనపై నుంచి వరద ప్రవహించింది. ఇక్కడ చీమల్పాడ్, సంగం, సింగార్బగుడకు రాకపోకలు నిలిచాయి. ఇంత పెద్ద వాన, ఇంత పెద్ద వాగు ఎన్నడూ చూడలేదని ప్రజలు తెలిపారు. గైరాన్అండా, వంగ్ధాల్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.
వాసర్, వంగాల్, పోట్పల్లి, గర్డేగాం, గౌడ్గాం, అంతర్గాం, బొక్కస్ గాం, సిర్గాపూర్, సంగం, ఉజలం పాడ్, తదితర ప్రాంత పరిసరాల్లో వాగు ఉదృతి వల్ల వాగుకు ఇరు పక్కన ఉన్న వందల ఎకరాల పంట భూములు నీట మునిగాయి. పంటలు తీవ్రంగా నష్టపోయినట్లు రైతులు తెలిపారు.
BJP MP | వరద బాధితులకు సాయం చేస్తుండగా దాడి.. ఎంపీకి తీవ్ర గాయాలు
BC Reservations | బీసీ రిజర్వేషన్లపై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
Mudigonda : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలి : లింగాల కమల్‌రాజ్