Murder | సంగారెడ్డి జిల్లా బీరంగూడలో దారుణం వెలుగుచూసింది. తమ కూతురును లవ్ చేస్తున్నాడనే నెపంతో అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయిని ఇంటికి పిలిపించి మరీ హత్య చేశారు. కూతురును ప్రేమిస్తున్నాడనే కారణంతో ఇంజినీరింగ్ స్టూడెంట్ జ్యోతి శ్రావణ్ సాయిని అమ్మాయి తల్లిదండ్రులు హత్య చేసిన దారుణ ఘటన కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే.. జ్యోతి శ్రావణ్ సాయి (20)ను బీరంగూడ ఇసుకబావికి చెందిన శ్రీజ (19) గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రీజ కుటుంబ సభ్యులు పలుమార్లు జ్యోతి శ్రావణ్ సాయిని హెచ్చరించారు. ఈ క్రమంలో శ్రీజ కుటుంబ సభ్యులు మీ ఇద్దరికి పెళ్లి చేస్తామని, మాట్లాడుకుందామని జ్యోతి శ్రావణ్ సాయిని నమ్మించి తమ ఇంటికి పిలిపించుకున్నారు.
జ్యోతి శ్రావణ్ సాయి వారి ఇంటికి రాగానే శ్రీజ కుటుంబ సభ్యులు అతడిపై ఒక్కసారిగా దాడి చేసి హత్య చేశారు. జ్యోతి శ్రావణ్ సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అమీన్ పూర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మైసమ్మ గూడలో బి సెయింట్ పీటర్ కాలేజీలో బీటెక్ (సీఎస్ఈ) సెకండియర్ చదువుతున్న జ్యోతి శ్రావణ్ సాయి కుత్బుల్లాపూర్లో రూం తీసుకుని నివాసం ఉంటున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Fire accident | టెక్స్టైల్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన 20కి పైగా దుకాణాలు
Ramavaram : ప్రతి ఒక్కరు శాంతియుతంగా ప్రచారం కొనసాగించాలి : కొత్తగూడెం టూ టౌన్ సీఐ ప్రతాప్
Akhanda 2 | అఖండ 2 దెబ్బకి ఇన్ని సినిమాలు వాయిదా పడ్డాయా.. ఏకంగా రజనీకాంత్ చిత్రం కూడా..!