Free Training | సంగారెడ్డి, జూన్ 27 : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు హోమ్ కేర్‌లో నర్సింగ్ అసిస్టేంట్లుగా ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు మెడ్వాన్ డైరెక్టర్ మధుసూధన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని మెడ్వాన్ కార్యాలయంలో నిరుద్యోగ యువకులతో సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి స్వంత కాళ్లపై నిలబడే విధంగా చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రతీ నెలా 30 మందికి శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. యువతను లైఫ్ సర్కిల్ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో నైపుణ్యాభివృద్దికి శిక్షణకు ఎంపిక చేశామన్నారు.
అలాగే వృద్దులకు ఆరోగ్య సంరక్షణ, సేవలు అందించడంలో యువతకు సాధారికత కల్పించడానికి ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమన్నారు. ఈ శిక్షణ మూడు నెలల పాటు ఉంటుందని, మొదటి నెల తరగతి గది శిక్షణ, ఆ తర్వాత రెండు నెలలు ఆన్ జాబ్ శిక్షణ (ఒజేటీ) ఉంటుందన్నారు.
ఒజేటీ సమయంలో రెలకు రూ.10వేల స్టైఫండ్ ఇస్తారని, దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. శిక్షణ పూరెన తర్వాత ప్రారంభవేతనం నెలకు రూ.17వేలు ఉంటుందని, ఉచిత హాస్టల్, భోజన సౌకర్యాలు ఉంటాయన్నారు. ఈ సదవకాశాన్ని నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని డైరెక్టర్ కోరారు. ఈ సమావేశంలో లైఫ్ సర్కిల్ ప్రతినిధి మధుకర్, మెడ్వాన్ కో-ఆర్డినేటర్లు సమీర్, స్వప్న, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.
Transformer | ట్రాన్స్ఫార్మర్ పెట్టారు.. కానీ కనెక్షన్ మాత్రం మరిచారు.. ముళ్ల పొదల్లో ఇలా