Fish Market | మునిపల్లి, ఆగస్టు 24 : మునిపల్లి మండలంలోని తక్కడపల్లి గ్రామ శివారులో గల సింగూర్ బ్యాక్ వాటర్ సమీపంలో ప్రభుత్వం చేపల మార్కెట్ నిర్మాణం చేపడితే సింగూర్ బ్యాక్ వాటర్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు క్రమం తప్పకుండా ఉపాధి దొరుకుతుందని స్థానిక మత్సకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సింగూర్ బ్యాక్ వాటర్ చుట్టూ ఉండే గ్రామాల్లో మత్సకారులు సింగూరు బ్యాక్ వాటర్ లో నిత్యం చేపలు పట్టి గ్రామాల్లో తిరుగుతూ చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.
మత్స్యకారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి ఉంచి చేపల మార్కెట్ నిర్మాణం చేపట్టి మండల మత్స్యకారులకు అండగా నిలబడితే మత్సకారులకు నిత్యం ఉపాధి దొరుకుతుంది. నిత్యం సింగూర్ బ్యాక్ వాటర్ లో సాయంత్రం వలలు వేసి తెల్లారి లేవగానే సింగూర్ బ్యాక్ వాటర్ లో చేపలు పట్టుకొచ్చి గ్రామాల్లో తిరుగుతూ అమ్ముకుంటున్నట్టు స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ ప్రత్యేక చొరవ తీసుకొని సింగూర్ బ్యాక్ వాటర్ సమీపంలో ఉన్న తక్కడపల్లి గ్రామంలో చేపల మార్కెట్ నిర్మాణం చేపడితే మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుంది.
మంత్రి దామోదర రాజనర్సింహ చొరవ తీసుకోవాలి..
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మునిపల్లి మండలంలో చేపల మార్కెట్ నిర్మాణం చేపట్టేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. మండలంలోని బుసరెడ్డిపల్లి, తక్కడపల్లి, చిలపల్లి, బోడపల్లి,గార్లపల్లి కలపల్లి-బెలూరు, మక్తక్యాసరం గ్రామాల్లో మత్సకారులు నిత్యం సింగూర్ బ్యాక్ వాటర్లో చేపలు పట్టి ఊరు… ఊరు తిరుగుతూ అమ్మకాలు చేస్తుంటారు. మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక చొరవ తీసుకొని ముంబయి జాతీయ రహదారికి అతి దగ్గరలో ఉన్న మునిపల్లి మండలం తక్కడపల్లిలో చేపల మార్కెట్ నిర్మాణం చేపడితే మండలంలోని పలు గ్రామాలకు మధ్యలో ఉండడంతో తక్కడపల్లిలో చేపల మార్కెట్ నిర్మాణం చేపడితే మత్స్యకారులు మార్కెట్లో చేపలు అమ్ముకునేందుకు సులువుగా ఉండడంతోపాటు ఎంతో ఉపయోగకరంగా మారుతుంది.
మత్స్యకారులు ఎంతో అభివృద్ధి చెందుతారు..
మండలంలోని తక్కడపల్లి గ్రామంలో ప్రభుత్వం చేపల మార్కెట్ నిర్మాణం చేపడితే మండల మత్సకారులకు చేపలు అమ్ముకునేందుకు సులువుగా ఉండడంతోపాటు మత్సకారుల ఖర్చులు తగ్గిపోయి ఎంతో అభివృద్ధి చెందుతారు. మత్సకారులకు అనుకూలంగా సర్కార్ చేపలు మార్కెట్ ఏర్పాటు చేస్తే మత్స్యకారుల కుటుంబాలు ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి. మత్స్యకారుల అభివృద్ధిపై ప్రభుత్వం రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక దృష్టి పెట్టి మండలానికి సంబంధించి తక్కడపల్లి గ్రామంలో చేపల మార్కెట్ నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Daisy Shah | వాళ్లకి నడుము, బొడ్డు పిచ్చి ఉంది.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన వ్యాఖ్యలు
IADWS | ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ
Finger Millet | రాగులను అసలు రోజుకు ఎంత మోతాదులో తినాలి..? వీటితో కలిగే లాభాలు ఏమిటి..?