Road Works | జహీరాబాద్, జూన్ 19 : కలిసికట్టుగా పోరాడితే సాధించనిది ఏది ఉండదు. గ్రామానికి రోడ్డు మంజూరై ఏండ్లు గడుస్తున్నా నిర్మాణం పనులు చేపట్టకపోవడంతో గ్రామానికి చెందిన యువకులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేపట్టి సంబంధిత అధికారులు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. ఇది ఎక్కడో కాదు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం వడ్డీ గ్రామ ప్రజలు యువకులు కలిసి పోరాటం చేసి గ్రామం నుండి వడ్డీ గ్రామం మీదుగా శంషులాపూర్, డప్పుర్ రోడ్డు పనులను ప్రారంభించుకున్నారు.
స్థానిక గ్రామ చౌరస్తా నుంచి డప్పుర్ వెళ్లే రోడ్డు పూర్తిగా కంకర తేలి అద్వానంగా మారింది. ఈ రోడ్డు మార్గం గుండా రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పోవాల్సి వచ్చేది. కంకర తేరిన రోడ్డు గుండా బైకులపై వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి ప్రమాదాలకు గురికావాల్సి వచ్చేది. ఈ రోడ్డు దుస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో స్థానిక గ్రామస్తులు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు దృష్టికి తీసుకెళ్లారు.
ధర్నాలు, నిరాహార దీక్షలు..
రోడ్డు దుస్థితి గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 96 లక్షల రూపాయలను మంజూరు చేయించారు. ఈ నిధులతో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రోడ్డును బీటీతోపాటు సీసీ రోడ్డు ఓ కల్వర్టు పనులు చేపట్టాల్సి ఉంది. కానీ వరుసగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు రావడం ఎన్నికల కోడ్‌తో పనులు నిలిచిపోయాయి. రోడ్డు పనులు ప్రారంభించాలని గ్రామానికి చెందిన యువకులు పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేపట్టారు. పలుమార్లు సంబంధిత జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
సంబంధిత జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ గత వారం రోజుల క్రితం వడ్డీ -డప్పుర్ రోడ్డు పనులను చేపట్టారు. ప్రస్తుతం మట్టి కంకరతో లెవెలింగ్, కల్వర్టు నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ గ్రామస్తులు కలిసికట్టుగా పోరాటం చేసి అనుకున్న రోడ్డు సమస్యను పరిష్కరించుకున్నారు. రానున్న రోజుల్లో రోడ్డు సమస్య దూరం కానుందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Bonakal : ‘కాంగ్రెస్ నాయకుల నుండి రక్షించండి’
GHMC | ఇదేనా స్వచ్చ సర్వేక్షన్ స్పూర్తి.. చెత్త తరలింపులో బల్డియా నిర్లక్ష్యం
Banjarahills | వర్షాకాలంలో రోడ్ల తవ్వకాలపై నిషేదానికి తూట్లు.. కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కి పనులు