Drugs Combustion | పటాన్ చెరు, సెప్టెంబర్ 20 : సంగారెడ్డి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం నమోదైన 20 కేసులలో సీజ్ చేయబడిన ప్రభుత్వ నిషేధిత 583 కిలోల ఎండు గంజాయి, 1.777 కిలోల ఆల్ప్రాజోలం, 980 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను చట్ట ప్రకారం కోర్టు అనుమతి తీసుకుని, జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో పాశమైలారం పారిశ్రామిక వాడల్లోని మెడికేర్ పరిశ్రమలో ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ దహనం చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.
శనివారం పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో దహనం చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్‌లోని నియమ నిబంధనల ప్రకారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉన్న ప్రభుత్వ నిషేధిత ఎండు గంజాయి, ఆల్ఫాజోలం, ఎండీఎంఏను ఈ రోజు దహనం చేయడం జరిగిందని అన్నారు. కొందరు అక్రమార్జనలో భాగంగా అక్రమ ఆల్ప్రాజోలం తయారీ, గంజాయి సాగు, విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి లాగుతున్నారని అన్నారు.
సంగారెడ్డి జిల్లాలో అసాంఘీక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ టీమ్స్ జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ దాడులు చేపట్టడం జరిగిందని అన్నారు. జిల్లాలో ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయించి, సరఫరా చేసినా లేదా సాగు చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ డ్రగ్ డిస్పోజల్ కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్యగౌడ్, పటాన్ చెరువు డీఎస్పీ ప్రభాకర్, వర్టికల్ డీఎస్పీ సురేందర్ రెడ్డి, మెడికేర్ ఎన్విరాన్మెంటల్ పరిశ్రమ మేనేజర్ శివారెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ బి రమేష్, ఎస్ న్యాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావ్, పటాన్ చెర్వు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి, భానూర్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, సంబంధిత ఎస్ హెచ్ఓలు ఉన్నారు.
Katamaya Kits | గీతా కార్మికులకు కాటమయ్య కిట్లు పంపిణీ చేయాలి
Kothagudem Urban : ‘దసరా పండుగకు నేటి నుంచి ప్రత్యేక బస్సులు.. 50 శాతం అదనపు చార్జీలు’
Kothagudem Urban : పెన్షన్లు పెంచి పంపిణీ చేయాలి : దాసరి సారధి