Drinking Water | పటాన్చెరు, ఏప్రిల్ 9 : ముత్తంగి జాతీయ రహదారిపై తాగునీరు వృధాగా పోతున్నది. ఇవాళ పటాన్చెరు మండలం ముత్తంగిలో న్యూటౌన్ హోటల్ ముందు మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోయింది. పగిలిన పైప్లైన్ ద్వారా తాగునీరు జాతీయ రహదారిపై ప్రవహిస్తోంది. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సర్వీసు రోడ్డును వేస్తున్నారు. సర్వీసు రోడ్డు వెంబడి తాగునీరు వృధాగా పోతున్నది.
గత 34 రోజులుగా ముత్తంగి, చిట్కుల్లోని పలు కాలనీలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. పలు చోట్ల రోడ్డు విస్తరణ కాంట్రాక్టర్ గ్రీడ్ పైపులను పగలగొట్టడంతో నెల రోజులుగా మరమత్తులు నిర్వహిస్తున్నారు. మంగళవారం రోజు నీటి ట్రయల్స్ నిర్వహించారు. తరువాత రోజే పైపులు పగిలి తాగునీరు రోడ్లపాలవుతున్నది.
ముత్తంగి, చిట్కుల్ గ్రామాలను కాలుష్యపీడిత గ్రామాలుగా, భూగర్భజలాలు కలుషితమైన ప్రాంతాలుగా సుప్రీంకోర్టు గుర్తించి ఉచితంగా తాగునీరు అందజేయాలని ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది. అప్పటి తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా 2017 నుంచి ఈ ప్రాంతానికి ఉచితంగా సురక్షితమైన తాగునీరును అందజేసింది.
BRS | ఇది పెండ్లి పత్రిక కాదు..! బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆహ్వాన పత్రిక..!!
MLA Kadiyam Srihari | ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
TG Weather | తెలంగాణలో మరో మూడురోజులు వానలే.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ