Damodara Raja Narasimha | ఝరాసంగం, మార్చి 29 : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో శని అమావాస్యను పురస్కరించుకొని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ ఆలయ రాజగోపురం ముందు ఆలయ అర్చకులు వేదామంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
పార్వతి సమేత సంగమేశ్వర స్వామి వారికి అభిషేకం, మంగళహారతి వంటి కార్యక్రమాలను చేసి మొక్కలు తీర్చుకున్నారు. అదే విధంగా మండల పరిధిలోని బర్ధీపూర్ దత్తగిరి ఆశ్రమంలో శనైశ్వరునికి తైలాభిషేకంతోపాటు నవగ్రహాలకు, పంచావృక్షాలకు, జ్యోతిర్లింగాలకు పూజలు నిర్వహించారు.
మండల పరిధిలోని బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలోని శనీశ్వర ఆలయాన్ని దర్శించుకుని తైలాభిషేకం నిర్వహించారు. అనంతరం శనీశ్వర హోమంలో, పూర్ణాహుతిలో పాల్గొన్నారు. కేతకి ఆలయ ఈవో శివరుద్రప్ప, ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శిఖామణి అవదూతగిరి మహారాజ్లు మంత్రికి పూలమాల వేసి, శాలువాతో ఘనంగా సన్మానించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆలయ పరిసర ప్రాంతాల్లో ఇంత దుర్వాసన వస్తుంటే ఏమి చేస్తున్నారంటూ ఆలయ అధికారుల పని తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించండంటూ స్థానిక నాయకులకు సూచించారు. ఏడకులపల్లి గ్రామ శివారులో గల సప్తా పురి శనిఘాట్కు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని శనీశ్వరునికి తైలాభిషేకం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. వారి వెంట మండల అధ్యక్షుడు హనుమంతు రావు పాటిల్, జిల్లా యువజన నాయకులు నరేష్ గౌడ్, శేఖర్ పటేల్, మల్లయ్య స్వామి, వేణుగోపాల్, స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.
Kathmandu | నేపాల్లో హింస.. 100 మంది అరెస్ట్
Chilli Farming | సస్యరక్షణ చర్యలతోనే మిర్చి అధిక దిగుబడులు: డాక్టర్ ఎం వెంకటేశ్వర్ రెడ్డి
Heart Health | ఈ ఆహారాలను తింటే మీకు గుండె పోటు అసలు రాదు.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది..